Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ చేరువ లో KGF 2

ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ చేరువ లో KGF 2

KGF 2 world wide 5 days collections
KGF 2 world wide 5 days collections

తెలుగు సినిమా సత్తా ను ప్రపంచానికి చాటిచెప్పిన ఆర్ఆర్ఆర్ చిత్ర రికార్డ్స్ కు కెజిఫ్ 2 అతి దగ్గరిలో ఉంది. కన్నడ మూవీ కెజిఎఫ్ 2 అన్ని భాషల్లో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. విడుదలై రెండు వారాలు కావొస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం హడావిడి ఏమాత్రం తగ్గలేదు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, అచ్యుత్, ప్రకాష్ రాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

కెజిఫ్ 2 రెండు వారాల కలెక్షన్స్ చూస్తే ..

- Advertisement -

నైజాంలో రూ. 39.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.64 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.97 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.20 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.25 కోట్లు, గుంటూరులో రూ. 4.26 కోట్లు, కృష్ణాలో రూ. 3.85 కోట్లు, నెల్లూరులో రూ. 2.57 కోట్లతో.. కలుపుకుని రూ. 76.21 కోట్లు షేర్, రూ. 122.55 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 473.16 కోట్లు షేర్‌తో పాటు రూ. 957.65 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ రూ. 535.21 కోట్లు షేర్‌తో పాటు రూ. 967 కోట్లు గ్రాస్‌ను వసూలు చేయగా.. ఫలితంగా షేర్ పరంగా చాలా దూరంలో ఉన్నా.. గ్రాస్ పరంగా కేజీఎఫ్ మూవీ పది కోట్ల దూరంలోనే ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All