
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `పుష్ప`. సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బన్నీ ఊరమాస్ పాత్రలో లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించబోతున్నారు.
గురువారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ని బుధవారం రాత్రి విడుదల చేశారు. టీజర్‌లో బన్నీ చెబుతున్న `తగ్గేదిలే` డైలాగ్ వైరల్‌గా మారింది. ఇదే డైలాగ్‌ని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పలకడం పలువురిని ఆకట్టుకుంటోంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా బన్నీకి విషెస్ తెలియజేస్తూ మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
`పుష్ప` టీజర్ చూశాను. చాలా రియలిస్టిక్‌గా, రస్టిక్‌గా వుంది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ తగ్గేదేలే. హ్యాపీ బర్త్‌డే మైడియర్ బన్నీ` అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. మెగాస్టార్ తరహాలోనే మాస్ రాజా రవితేజ, శ్రీను వైట్ల, కాజల్ అగర్వాల్, డైరెక్టర్ గోపీచంద్, సునీల్, నవదీప్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితరులు బన్నీకి శుభాకాంక్షలు అందజేశారు.
#Pushpa టీజర్ చూసాను. చాలా రియలిస్టిక్ గా rustic గా ఉంది. పుష్పరాజ్ గా @alluarjun తగ్గేదేలే !!! Happy Birthday My Dear Bunny!
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2021