
సన్నీ లియోన్ ప్రస్తుతం మంచు విష్ణు సరసన గాలి నాగేశ్వరావు మూవీ లో నటిస్తుంది. సూర్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి రైటర్ కోన వెంకట్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే షూటింగ్ బ్రేక్ లో సన్నీ – విష్ణు రకరకాల ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా విష్ణు – సన్నీ – బాలాజీ లు కలిసి ఫన్నీ గేమ్ ఆడి..ఆ వీడియో సోషల్ మీడియా లో విడుదల చేయగా…తాజాగా సన్నీ ని వంటమనిషిని చేసాడు.
విష్ణు కోసం పరోటాలు చేసింది సన్నీ. స్వయంగా సన్నీ మైదా పండి పిసికి…పరోటాలు తయారు చేసి నూనేలో వేపి మరి రుచి చూపించింది. ఈ క్రమంలో సన్నిలియోన్ పరోటాలు చేస్తుంటే విష్ణు పక్కనే ఉండి ఆమెని ఆటపట్టించడం సరదాగా ఉంది. ఇద్దరు ఎంచక్కా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ వంటల కార్యక్రమాన్ని ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.