Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే!

మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే!

మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే!
మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే!
సినిమా వాళ్లు పారితోషికాలు తీసుకుంటూనే సేవ చేస్తున్నాం అంటుంటారని, ప్రభుత్వాల నుంచి సబ్సడీలు, స్థలాలు కావాలి  అడుగుతుంటారని చాలా మంది అంటుంటారు నిజమే కానీ మా గురువు దాసరినారాయణరావు నిజంగానే సేవ చేశారు. తెలుగు సినిమా వున్నంత కాలం ఆయన కీర్తి ఆజరామరం అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. డా.దాసరి నారాయణరావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమొరియల్ నీడ చారిటబుల్ ట్రస్ట్ తరుపున దాసరి కుమార్తె హేమాలయ కుమారి, అల్లుడు డా.రఘునాథ్‌బాబు పలువురికి గురువారం చంద్ర, రాజేష్, చందు, నాగేశ్వరరావులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.  ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మా గురువు దాసరి గురించి గిట్టని వాళ్లు ఎన్ని చెప్పినా ముమ్మాటికి ఆయన సేవ చేశారు. తెలియకుండా ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు. ఆయనను అత్యంత సన్నిహితంగా చూశాము కాబట్టి ఆయన ఏంటో మాకు తెలుసు. మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే. దాసరి సేవల్ని ఆయన కూతురు, అల్లుడు కొరనసాగించడం ఆనందాన్ని కలిగిస్తోంది అన్నారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ తన చుట్టూ వున్న వారికి సహాయం చేయాలన్న గొప్ప హృదయం దాసరిది. తండ్రి ప్రారంభించిన సేవా సంస్థను ఆయన కూతురు హేమాలయ కుమారి, అల్లుడు డా. హరనాథ్‌బాబు కొనసాగించడం నిజంగా హేట్సాఫ్. తల్లిదండ్రులు ఈ రోజుల్లో పిల్లలకు చదువునే ఆస్థిగా ఇస్తున్నారు. తన దగ్గర పనిచేసిన పిల్లలకు ఆసరాగా నిలుస్తూ వారి పిల్లల చదువులకు ష్కారలర్ షిప్ అందజేస్తున్నారంటే మా గురువుగారు నిజంగా చిరంజీవే. ఆయన చనిపోలేదు. మనందరిలో బ్రతికే వున్నారు. వుంటారు అని తెలిపారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ గురువుగారితో నాది చాలా ఏళ్ల అనుబంధం. ఆయన అందించే స్కాలర్‌షిప్‌లను ను, తమ్మారెడ్డి భరద్వాజ ఫైనల్ చేసే వాళ్లం. తన వద్దకు సహాయం కోరి వచ్చిన వాళ్లలో ఫ్రాడ్‌లు వున్నా పెద్ద మనసుతో క్షమించి సహాయం చేసే అద్భుతమైన సేవా మూర్తి దాసరి నారాయణరావు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు మనవళ్లు, దవళసత్యం, రాజేంద్రకుమార్, సంజీవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కొంకపురి నాటక కళాపరిషత్‌కు దాసరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts