
టాప్ ఇండియన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఆర్ ఆర్ ఆర్ పైనే పెట్టాడు. కొంత ప్యాచ్ వర్క్ మినహా ఈ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం జక్కన్న పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలను చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఉంటుందని అధికారికంగా రాజమౌళి వెల్లడించిన విషయం తెల్సిందే.
అయితే రాజమౌళి మహేష్ చిత్రానికి మూవ్ అయ్యే ముందు డైరెక్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ను చేస్తాడట. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అది వచ్చే సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను మొదలుపెట్టి వచ్చే ఏడాది దసరా నాటికి కానీ మహేష్ ఫ్రీ అవ్వడు.
ఈలోగా రాజమౌళి ఆ బాలీవుడ్ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాడన్నమాట. అయితే దీనిపై మరింత క్లారిటీ రావడానికి కొంత సమయం పడుతుంది.