Homeటాప్ స్టోరీస్క‌రోనా ఎఫెక్ట్ : అవ‌తార్ సీక్వెల్స్ మ‌ళ్లీ వాయిదా!

క‌రోనా ఎఫెక్ట్ : అవ‌తార్ సీక్వెల్స్ మ‌ళ్లీ వాయిదా!

క‌రోనా ఎఫెక్ట్ : అవ‌తార్ సీక్వెల్స్ మ‌ళ్లీ వాయిదా!
క‌రోనా ఎఫెక్ట్ : అవ‌తార్ సీక్వెల్స్ మ‌ళ్లీ వాయిదా!

క‌రోనా దెబ్బ‌కు ప్ర‌తీ రంగం విష‌మ ప‌రిస్థితుల్ని ఎదుర్కుంటోంది. అందులో సినీ రంగం మ‌రీ కోలుకోలేని స్థాయిలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. వంద‌ల కోట్లు వెచ్చించి చిత్రాల్ని నిర్మిస్తున్న నిర్మాత‌లు క‌రోనా కార‌ణంగా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. చిన్న సినిమా నుంచి హాలీవుడ్ చిత్రాల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా జేమ్స్ కెమ‌రూన్ రూపొందిస్తున్న `అవతార్‌` చిత్ర సీక్వెల్స్ కూడా చిక్కుల్లో ప‌డ్డాయి.

జేమ్స్ కెమెరూన్ అద్భుత సృష్టి `అవ‌తార్‌` చిత్రానికి నాలుగు సీక్వెల్స్ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో తొలి సీక్వెల్ `అవ‌తార్ -2` సిద్ధం అవుతోంది. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ సీక్వెల్‌ని ముందు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా వైర‌స్ కార‌ణంగా మ‌రో ఏడాది పోస్ట్ పోన్ అయిన‌ట్టు తెలిసింది. సీక్వెల్‌ని 2022 డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తున్న‌ట్టు డిస్నీ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది.

- Advertisement -

`అవ‌తార్ 2` రిలీజ్ వాయిదా ప‌డ‌టం ఇదే తొలిసారి కాదు. 2014లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాన‌ని ద‌ర్‌శ‌కుడు జేమ్స్ కేమెరూన్ ప్ర‌క‌టించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ ద‌ఫా అయినా అనుకున్న స‌మ‌యానికి సీక్వెల్‌ని రిలీజ్ చేస్తారా లేక యాజ్ యూజువ‌ల్‌గా మ‌రో రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టిస్తారా అని నెటిజ‌న్స్ కామెంట్ లు చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All