
ఈరోజు గణతంత్ర దినోత్సవం కావడంతో మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియో రిలీజ్ చేసారు . కొరటాల శివ అంటే కమర్షియల్ సినిమాకు సామాజిక సందేశాన్ని జోడించి తీసే దర్శకుడిగా పేరుంది . ఇప్పటివరకు చేసిన మూడు చిత్రాలు కూడా అదే కోవలో వచ్చాయి . ఇక ఇప్పుడేమో రాజకీయ కోణంలో తీస్తున్నాడు . ఎవరిని నొప్పిస్తాడో ఎవరిని మెప్పిస్తాడో చూడాలి . ఇక ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది .
- Advertisement -